Wednesday, September 28, 2011

MAGADA WAS UNDER SATAVAHANA

I SAID SATAVAHANAS CONQUERED MAGADHA TO SUBSTANTIAT THIS A CLAY MOULD OF SATAVAHANA WITH INCRIPTIONS AS FOLLOWS WAS FOUND
 The terracotta sealing's bearing the legend "yuvaraajasya vaasshisthiputrasya gutalalaashiya in typical Satavahana Brahmi 

Roman-era gold coin found in Panigiri


THIS GIVE MORE STRENGTH TO MY THEORY THAT SATAVAHANAS HAVE DONE DIRECT TRADE WITH ROMANS
Last Updated : 19 Mar 2011 08:52:17 AM IST    Express News Service 
During the excavation at Panigiri, a Buddhist site in Tirumalagiri mandal in  Nalgonda district,  a Roman gold coin weighing 7.3 grams issued by the VII th Roman king Nerve Ceaser (96-98 AD) was recovered few days ago.
Archaeology and Museums department director P Chenna Reddy revealed that during the earlier excavations at Panigiri, Votive Stupas, Chaityas, Viharas and a congregation hall besides a good  number of  antiques  including silver, lead and potin coins of the Satavahanas, Western Kshatrapas, Ikshvakus and Mahatalavaras belonging to the 2nd century BC  to the 3rd Century AD were recovered.  
“So far 60 lead coins of the Satavahana and Ikshvaku dynasties were recovered. The fact that a gold coin of Roman king Nerve (1st Century A.D)  was unearthed indicates  the fact that there was a brisk trade between the Telugus and the Roman empire. It was also for the first time that a Roman gold coin was recovered from a Buddhist site in Andhra Pradesh,’’ Chenna Reddy said.
Officials said that Panigiri,  a very important Buddhist site in Telangana is slated for development and funds to a tune of Rs 72 lakh  were allotted for its development. Officials said that Panigiri will become a major tourist attraction both for domestic and foreigners especially for South East Asian tourists in the near future.

Monday, September 26, 2011

మనవాళ్లు ఎవరు ?


మనవాళ్లు


ఎవరు మనవాళ్లు ?
మనకు జన్మనిచ్చిన 
తల్లిదండ్రులా..
మన తోబుట్టువులా..
మన రక్తం పంచుకు పుట్టిన
మన పిల్లలా..
మనకు విద్యాబుద్ధులు నేర్పిన
గురువులా..
మన స్నేహితులా..
మన సహోద్యోగులా..
మనకు సన్నిహితులా -
ఎవరు...?
ఈ అసంఖ్యాక ప్రజానీకంలో
ఎదుటివాడి బాధను చూసి
జాలి దయతో
ఎవరి కళ్లైతే చెమ్మగిల్లుతాయో
వాళ్లంతా మనవాళ్లే!

Monday, September 19, 2011

తొలి తెలుగు మహిళా ఆత్మకథ,


తొలి తెలుగు మహిళా ఆత్మకథ


ఉత్తమనాయకుడికి ఉండవలసిన లక్షణములన్నియు మూర్తీభవించిన తన నాధుడు శ్రీ ఏడిదము సీతారామయ్యని ఈ పుస్తకానికి నాయకుడిగా చేసుకొన్నాను అని ముందుమాటలో సత్యవతిగారు అన్నారు. ఈ పుస్తకానికి ముందు “సీతారామాస్తమయ”మని పేరు పెడదామనుకొన్నారు కాని, “వారి అర్థ శరీరిణినైన నేనును ఆ కష్టముల ననుభవించినదాని నగుట చేతను, ఇప్పటికిని మా ఆఆఖ్యాయికకు, శాంతి జరుగక రంగమధ్యమునందే యుండుట చేతను, దీనికి ఆత్మచరితము అని పేరు బెట్టితిని”.
ఈ పుస్తకం రెండుభాగాలుగా ఉంటుంది. మొదటిభాగం సత్యవతిగారు సీతారామయ్యగారు మొదటిసారి కలవటంతో ప్రారంభమై, సీతారామయ్యగారి మరణం తర్వాత ఆమె అభిప్రాయాలతో ముగుస్తుంది. రెండవభాగంలో భగవంతుని అస్తిత్వం, ఆచార వ్యవహారములు వంటి విషయాలపై సత్యవతిగారి ప్రశ్నలు, ఆమెకు తోచిన సమాధానాలు ఉన్నాయి.
సత్యవతిగారి తండ్రి బెజవాడలో డి.పి.డబ్ల్యులో ఓవర్‌సీయరు. “అయిదేండ్లు వచ్చుసరికి, మా తల్లితండ్రులు, అక్షరాభ్యాసమునకై, మా యూరఁ గల బాలికా పాఠశాలకుం బంపిరి. నాకు చిన్న తనము నుండియు, దైవభక్తి మెండు. అసత్యము బలుకుటసహ్యము. నా తోడి బాలికలెపుడైన పోరాడుచుండిన నేనచట నుండెడిదానఁ గాదు. అనారోగ్యముగ నుండు బాలికలతో నేనెప్పుడును నేస్తము గట్టలేదు. నా జననీజనకులుగాని ఉపాధ్యాయులుగాని చెప్పిన పనిని జవదాటక చేయుట నా కలవాటు. భాల్యము నుండియు సావిత్రి, చంద్రమతి, సీత మున్నగు పతివ్రతల చరితములు చదువుట యందెక్కువ ఉత్సాహ ముండెడిది.”

ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము


ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము.
ఈ పుస్తకం మొదటిసారి 1934లో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణశాలయందు క.కోదండరామయ్యగారిచే ముద్రించబడింది. ఈ పుస్తకం ముందుమాట (ఫిబ్రవరి 1, 1934) వ్రాసినప్పుడు సత్యవతిగారు అవనిగడ్డలో ఉన్నారు. స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చు అని ఈ పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన శ్రీ వకుళాభరణం రామకృష్ణ భావించారు. ఆయన పరిశోధన ప్రకారం, 1934కు ముందు తెలుగులో మూడు ఆత్మకథలు మాత్రమే ప్రచురింపబడ్డాయి: కందుకూరి వీరేశలింగము స్వీయ చరిత్రము (మొదటి సంపుటము 1911, రెండవ సంపుటము 1915), రాంభొట్ల జగన్నాధ శాస్త్రి స్వీయవరిత్రము (1916, విశాఖపట్టణము), రాయసం వెంకట శివుడు ఆత్మచరితము (1933, గుంటూరు). అందుచేత తొలి తెలుగు స్వీయచరిత్రల వరుసలోనూ, సత్యవతిగారిది ఉన్నత స్థానమే.
ఉత్తమనాయకుడికి ఉండవలసిన లక్షణములన్నియు మూర్తీభవించిన తన నాధుడు శ్రీ ఏడిదము సీతారామయ్యని ఈ పుస్తకానికి నాయకుడిగా చేసుకొన్నాను అని ముందుమాటలో సత్యవతిగారు అన్నారు. ఈ పుస్తకానికి ముందు “సీతారామాస్తమయ”మని పేరు పెడదామనుకొన్నారు కాని, “వారి అర్థ శరీరిణినైన నేనును ఆ కష్టముల ననుభవించినదాని నగుట చేతను, ఇప్పటికిని మా ఆఆఖ్యాయికకు, శాంతి జరుగక రంగమధ్యమునందే యుండుట చేతను, దీనికి ఆత్మచరితము అని పేరు బెట్టితిని”.