Tuesday, January 24, 2012

గుడిసేవ విష్ణుప్రసా ద్‌ గారు బాలల కథలు,ADARSH,Youngest Stamp collector,1998


ఏ జాతి సాహి త్యం లోనై నా బాల సాిహ త్యానికి గొప్ప విశిష్టమైన స్థానం వుం టుంది. ఈ బాల సాహి త్యం ముఖ్యం గా మూడు రకాలు గా కనిపిస్తుంది. ఒకటి పెద్దలు బాలల కోసం సృజించే సాహిత్యం కాగా.. రెండవది బాలలే సృష్టించే సాహిత్యం. ఇక మూడవది పెద్దల కూ, బాలలకూ పనికివచ్చే సాహిత్యం’’ అం టారు ప్రముఖ రచయిత గుడిసేవ విష్ణుప్రసా ద్‌.

ADARSH,Youngest Stamp collector,1998


గుడిసేవ విష్ణుప్రసా ద్‌ గారు బాలల కోసం కథలు, గేయాలు, వ్యాసాలు, ఆకాశవా ణి ప్రసంగాలు, శతకాలు రచించారు. వీరి కథలు బాలజ్యోతి, వార్త, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక జాగృతి వంటి అనేక పత్రికల్లో చోటు చేసుకున్నాయి. బాలల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. బాల దీపిక (బాలగేయాలు), భరతబాల (బాలల శతకం), అంత్యాక్షరి (బాలలకు పద్యాల సంకలనం) వీరికి బాలసాహిత్యంలో గుర్తింపు తీసుకొచ్చాయి. 15కు పైగా ఆకాశవాణి బాలానందం - బాలల కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా బాలసాహిత్యం స్థితిగతులు, బాలసాహిత్యం భవిష్యత్తు ఏమిటి, బాలల నెహ్రూ వంటి ప్రసంగాలు రచించి ప్రసారం చేశారు.

బాలల కోసం రాసిన భరత బాల శతకం వీరికి రాష్టస్థ్రాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ వారు ఇందులోని పద్యాల ను వివిధ మాడ్యూల్స్‌లో పాఠ్యేతర ప్రణాళిక లో ప్రచురించారు. ఈ పద్యాలు, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. గుడిసేవ విష్ణుప్రసాద్‌ బాలసాహిత్యం గ్రంథాల పరిశీలకునిగా సేవలందించారు. రాజీవ్‌ విద్యామిషన్‌ నిర్వహించిన బాల సాహిత్య రచనా కార్యక్రమంలో ఎస్‌.ఆర్‌.జి గా కొన్ని వందల పుస్తకాలను పరిశీలించటం, రచించటం, అనువాదాలు చేయడం జరిగింది. గిరిజన భాషలైన కొండ, కువి, ఆదివాసీ మున్నగు భాషల బాలసాహిత్య రచనలు కూ డా ఎస్‌.ఆర్‌.జిగా విశాఖపట్టణం (భీమిలి) వెళ్లి శిక్షణ ఇచ్చారు.

No comments:

Post a Comment