ఒంగోలు పట్టణం - చారిత్రక విశేషాలు |
పూర్వం ఒంగోలు పట్టణం ''ఊంగిప్రోలు'' మరియు ''ఓగిప్రోలు'' అనే పేర్లతో గుండికాతరంగిణి (గుండ్లకమ్మ) నుండి శ్రీపర్వతం వరకు విస్తరించి ఉన్న వేంగీ దేశానికి రాజధానిగా వుండేది. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి రాజ్యం ఒంగోలు వరకు విస్తరించి వుండేది. తరువాత కాలంలో తళ్ళికోట యుద్ధ కారణంగా ఒంగోలు నల్గొండ నవాబుల పాలనలోకి వచ్చింది. 17వ శతాబ్దిలో ఒంగోలులో మందపాటివారి వంశస్థులు తమ రాజ్యాన్ని స్థాపించారని, ఆ వంశీకుడైన రఘపతిరాజు ఇప్పుడు ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయాన్ని, ఒంగోలు కోటను నిర్మించారని చరిత్ర చెబుతోంది. పల్లవ రాజులైన విజయస్కందవర్మ, సింహవర్మల కాలంనాటి శాసనాలలో ఒంగోలు ప్రస్తావన ఉంది. ఈ రాజులు క్రీ||శ|| 3,4 శతాబ్దాలలో పరిపాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. కీ||శ|| 4వ శతాబ్దినాటి శాసనంలో ''ఒంగోడు'' అనే పేరుంది.13వ శతాబ్దినుండి ''ఒంగోలు''గా వ్యవహరించబడుతుంది. 18వ శతాబ్ది తరువాత ''వంగోలు'' అనికూడ కొన్ని పత్రాల ద్వారా తెలుస్తుంది. 1792లో ఒంగోలు నెల్లూరు మండలంలో భాగమైంది. 1795లో ఒంగోలు ప్రాంతాన్ని పల్నాడు జిల్లాలో కలిపారు. 1801లో నెల్లూరు జిల్లాలో చేర్చారు. అప్పుడు అజ్ముద్దౌల సంధి జరిగింది. 1904లో జిల్లాల పునర్విభజన సందర్భంగా గుంటూరు జిల్లాలో చేర్చబడింది. ఈ పట్టణం బంగాళాఖాతానికి 16 కి.మీ. దూరంలో ఉంది. 1876 సం||లో ఒంగోలు మున్సిపాలిటీగా అవతరించింది. 1939 సం|| వరకు జిల్లా బోర్డు ఒంగోలు కేంద్రంగా ఉండేది. ఒంగోలులోని రంగరాయుడు చెరువును విస్మరించలేము. ఒంగోలు పట్టణం ప్రస్తుతం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందుతుంది. |
Statue of Lord Hanuman. The height of this Statue is 30 feet. It is the highest statue in Ongole. Lord Hanuman is considered to be a powerful God. There is a temple behind this Statue. Many people will go to that temple and offer special prayers. |
Friday, January 13, 2012
ONGOLE HISTORY
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment